దివంగత ఎన్టీఆర్ జీవితం ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇప్పటికే విడుదల చేశాడు వర్మ. సోషల్ మీడియా ద్వారా “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాకు కావలసినంత ప్రచారం చేసుకుంటున్నారు వర్మ. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ కు భారీగా వ్యూస్ లభించాయి. అసలు విషయానికొస్తే… ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ లో సినిమా గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా కొంతమంది కుట్రలు పన్నుతున్నారని, కుట్రదారుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు.
ఈ విషయం తెలుసుకున్న వర్మ వెంటనే ఓ వీడియోతో చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. ఈ వీడియోలో “లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద వచ్చే రకరకాల రియాక్షన్స్‌కు మీ నుండి వచ్చే రియాక్షన్ ఏంటి సార్?” అని జర్నలిస్ట్ ప్రశ్నించగా, “మీరేమన్నా సరే రియాక్ట్ కావొద్దు, ఏమన్నా సరే” అంటున్న “మహానాయకుడు”లో చంద్రబాబు నాయుడు పాత్రధారి రానాను చూపించారు. అంతేకాదు ఈ వీడియో బిట్ “మహానాయకుడు” ట్రైలర్ నుంచి కావడం గమనార్హం. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ క్యాప్షన్ గా “లక్ష్మీస్ ఎన్టీఆర్ పై చంద్రబాబు భయం ఇలా ఉంది” అని రాశారు వర్మ.
CBN’s scared reaction on #LakshmisNTRtrailer pic.twitter.com/6gQOjmCE5Z
— Ram Gopal Varma (@RGVzoomin) February 21, 2019
అత్యాచారాలపై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్… ప్రముఖులు ఫైర్