telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హెచ్చరిక: సంక్రాంతికి ఊళ్లకు వెళ్లేట్టయితే.. చెప్పి వెళ్ళాలి.. లేదంటే.. అంతే.. 

huge number of police in election duty
ఎవరి గోలవారిది.. అన్నట్టుగా, సంక్రాంతి పండగ వస్తుంది, పాఠశాలకు, కళాశాలలకు, కార్యాలయాలకు సెలవులు ఇస్తారు. దానితో సొంత ఊరి బాట పడతారు అందరూ. అది వారి దారి, ఇక మిగిలింది దొంగల దారి, ఏంటది అంటే, ఊళ్లకు వెళ్ళిన వారు వారి ఇళ్లకు తాళాలు వేసి వెళ్లారు, ఈ దొంగలు వాటిని పగలగొట్టి దర్జాగా ఆయా ఇళ్లను దోచుకుని వెళ్లారు. ఇది సిటీలలో సాధారణంగా పండగ సీజన్ లలో జరుగుతున్న తంతు. అందుకే, ప్రతిసారి పండగ వస్తే, ఊళ్లకు వెళ్లేవారికి అధికారులు సూచనలు జారీచేయాల్సివస్తుంది. ఈసారి కూడా అదే చేస్తున్నారు. సంక్రాంతి పండగ నిమిత్తం సొంత ఊర్లకు వెళుతున్న హైదరాబాద్ ప్రజలు, సంబంధిత సెక్టార్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు.
నగర శివార్లలోని తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా, అంతర్రాష్ట్ర ముఠాలు చోరీలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని, ఇరుగు, పొరుగు వారికి కూడా సమాచారం ఇచ్చి పండగకు వెళ్లాలని ఆయన సూచించారు. గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా దొంగతనాలను అరికట్టేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని, రాత్రి వేళలలో పెట్రోలింగ్‌ పెంచామని అన్నారు. గొలుసు చోరీలకు పాల్పడేవారిని పట్టుకునేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టామని, దొంగలను పట్టుకునేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. 2017తో పోలిస్తే, 2018లో చైన్ స్నాచింగ్ కేసులు 30 శాతం తగ్గాయని అంజనీకుమార్‌ చెప్పారు. ఈమేరకు ప్రజలు సూచనలు పాటించి, సహకరించాలని కోరారు. 

Related posts