telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు కరోనా వ్యాక్సిన్ డ్రై రన్…

రేపు ఏపీలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించనున్నారు. మొత్తం 13 జిల్లాల్లో ఈ డ్రై రన్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రతి జిల్లాలోనూ మూడు కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, పీహెచ్సీ కేంద్రాల్లో వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు అధికారులు. ప్రతి కేంద్రంలో 25 మందికి డమ్మి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు అధికారులు. కృష్ణా జిల్లాలో ఇప్పటికే డ్రై రన్ నిర్వహించినా.. మరోసారి చేపట్టనున్నారు అధికారులు. డ్రై రన్ నిర్వహాణకు సంబంధించిన ఫీడ్ బ్యాకుని కేంద్రానికి నివేదించనుంది రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్. కృష్ణా జిల్లాలో చిన్నపాటి సాంకేతిక లోపాలు మినహా సాఫీగా సాగింది ఈ డ్రై రన్. అటు తెలంగాణలోనూ రేపు కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో 6 చోట్ల డ్రై రన్‌ నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి, యశోదా ఆస్పత్రి, తిలక్‌నగర్‌లోని పీహెచ్‌సీ కేంద్రంలో ఈ డ్రై రన్‌ నిర్వహిస్తారు.

Related posts