telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

హిందువుల పార్టీగా చెప్పుకునే బీజేపీకి… టిటిడిపై ఎందుకు వివక్ష : విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రంపై విరుచుకుపడ్డారు. జీఎస్టీ వసూళ్లపై తొలిసారిగా కేంద్రంపై తగ గళమెత్తారు. జీఎస్టీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి మినహాయింపు ఇవ్వాలని రాజ్యసభలో ప్రభుత్వానికి విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ అమలుకాక ముందు టీటీడీకి రాష్ట్ర ప్రభుత్వం పన్నుల నుంచి మినహాయింపు కల్పించేదని… జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి… టీటీడీ ఏటా సగటున 120 కోట్ల రూపాయలు జీఎస్టీ కింద చెల్లిస్తోందన్నారు. తిరుమల ప్రసాదంపై జీఎస్టీ లేనప్పటికీ ప్రసాదం తయారీకి అవసరమైన పదార్ధాలు, దినుసులపై జీఎస్టీ వసూలు చేస్తున్నారని..తిరుమల సందర్శన భక్తులకు తీర్థయాత్ర వంటిదని తెలిపారు. దైవ దర్శనం కోసం వచ్చి బస కోసం కాటేజీలకు చెల్లించే అద్దెపై కూడా హోటళ్ళ మాదిరిగా జీఎస్టీ వసూలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. హిందువుల పార్టీగా చెప్పుకునే బీజేపీ “తిరుమల తిరుపతి దేవస్థానం”విషయంలో ఇలాంటి వివక్ష చూపడం సరికాదని చురకలు విజయసాయిరెడ్డి అంటించారు. కాగా….కేంద్రం ప్రత్యేక హోదాపై ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది కేంద్రం. ఎంపీ రామ్మోహన్‌ నాయుడి ప్రత్యేక హోదాపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. 14 వ ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వడం లేదని… ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇస్తున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయని… సమస్యలను తెలుగు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్.

Related posts