telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

వైద్య వర్గాల్లో భయాందోళన… రుయా సూపరింటెండెంట్ సహా 250 మందికి పాజిటివ్

Ruia

తిరుపతిలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. నగరంలో రోజుకు 200 నుంచి 300 కేసులు నమోదవడం కలవరపరుస్తోంది. కరోనా బారిన పడుతున్న వారిలో వైద్యులు, వైద్య సిబ్బందే అధికంగా ఉన్నారు. కరోనా కట్టడిలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్న వారే అధికంగా కోవిడ్ బారిన పడుతుండటంతో ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రుయా సూపరింటెండెంట్ కు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం నగరంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఐసోలేషన్ లో ఉన్నారు. స్విమ్స్ లో ఒక కీలక అధికారి కూడా కోవిడ్ బారిన పడ్డారు. స్విమ్స్ లో ఇప్పటికే 150 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. దీనిని ఆరోగ్య శాఖ కూడా ధృవీకరించింది. రుయా ఆస్పత్రిలో కూడా వంద మందికిపైగా వైద్య సిబ్బందికి కరోనా వచ్చింది. రుయా సూపరింటెండెంట్ కు ఒక దశలో శరీరంలో ఆక్సిజన్ స్థాయి 95 ఉన్న తక్కువగా నమోదు కావడంతో కృత్తిమంగా ఆక్సిజన్ అందించారు. మంగళవారం నుంచి సాధారణంగా శ్వాస తీసుకుంటున్నారు.ఇంత పెద్ద మొత్తంలో వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతుండటం తో వైద్య ఆరోగ్య వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడు..ఏ నిమిషంలో కరోనా సోకుతుందో తెలియని పరిస్థితిలో రెండు ఆస్పత్రులలో ని వైద్య సిబ్బంది భయం భయంతోనే విధులు నిర్వహిస్తున్నారు.

Related posts