telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

అభినందన్ ఖాతాలో .. మరో ఘనత.. !

abhinandan as first indian to collapse f-16

భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్, ఎఫ్-16కు చెందిన యుద్ధ విమానాన్ని కూల్చిన తొలి పైలట్ గా నిలిచాడని, ఈ పని చేసిన తొలి వాయు సైనికుడు అతనేనని ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్ కృష్ణస్వామి అయ్యర్ వెల్లడించారు. అమెరికా తయారుచేయగా, పాకిస్థాన్ కొనుగోలు చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చడం అత్యంత సాహసోపేతమైన చర్యని ఆయన కితాబిచ్చారు. వాస్తవానికి ఎఫ్-16కు మిగ్-21 సాటిరాదని ఆయన అన్నారు. యుద్ధంలో మిగ్ లతో పోలిస్తే ఎఫ్-16లు మెరుగ్గా ఉంటాయని చెప్పారు.

మిగ్ విమానాలను నడిపే పైలట్లు తమ నైపుణ్యాన్ని పెంచుకునేందుకు మిత్ర దేశాల వద్ద ఉన్న ఎఫ్-16, మిరాజ్ ఫైటర్ జెట్స్ తోనూ శిక్షణ పొందుతుంటారని, అదే అభినందన్ కు ఉపకరించిందని ఆయన అన్నారు. ఎయిర్ వార్ చాలా వేగంగా ఉంటుందని, శత్రువుల కన్నా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని, సెకన్లలో సరిహద్దులను దాటి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుందని, ఇటువంటి పరిస్థితుల్లో అభి, ఎఫ్-16 విమానాన్ని కూల్చడం అసాధారణమేనని కృష్ణస్వామి అయ్యర్ తెలిపారు.

Related posts