ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో పూజా హెగ్డే జోరు కొనసాగుతోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ, వరుస విజయాలను అందుకుంటున్న పూజ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కోలీవుడ్‌లో సందడి చేసేందుకు కూడా పూజా హెగ్డే సిద్ధమవుతోంది. ‘మాస్టర్’ తరువాత ఇలయ దళపతి విజయ్ నటించబోయే కొత్త చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం సూర్యతో ‘సూరరైపోట్రు’ సినిమా రూపకల్పలో బిజీగా ఉన్న మహిళా దర్శకురాలు సుధ కొంగర చెప్పిన కథకు విజయ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ చిత్రంలో విజయ్‌కి జోడీగా పూజా హెగ్డేని నటింపజేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు కోలీవుడ్ టాక్. పూజా చివరిగా జీవాకి జోడీగా ‘ముగమూడి’ చిత్రంలో నటించింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడడంతో పూజాకి మళ్లీ తమిళంలో అవకాశం రాలేదు.