telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వాల్మీకి చిత్రం ఫస్ట్ లుక్ : .. మాస్ లుక్ లో .. వరుణ్ తేజ్.. !

varun tej mass look in valmiki

హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న లేటెస్ట్ సినిమా వాల్మీకి. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కాస్త నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు వరుణ్ తేజ్ రఫ్ క్యారెక్టర్ చేస్తున్న మొదటి సినిమా కూడా వాల్మీకి కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంట్రస్టింగ్ న్యూస్‌గా వైరల్ అవుతోంది. ఒక పక్క ఈ సినిమాను ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తూనే, మరోపక్క ప్రమోషన్ యాక్టివిటీకి కూడా శ్రీకారం చుడుతున్నారు. వాల్మీకిగా వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ ను ప్రీ టీజర్ గా వదలబోతున్నారని లేటెస్ట్ అప్‌డేట్. ఈ ప్రీ టీజర్ లో వరుణ్ తేజ్ షాకింగ్ గెటప్ రివీల్ అవుతుందని తెలుస్తోంది.

వరుణ్ తేజ్ గెటప్ ఊరమాస్ లుక్ తో వుంటుందని చిత్ర యూనిట్ నుండి సమాచారం. గడ్డం మాత్రమే కాకుండా మేకప్ అంతా ఊరమాస్ లుక్ లాగా వుంటుందట. వాల్మీకి తమిళ మాతృక జిగర్తాండకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ మాతృకలో కూడా బాబీ సింహా లుక్ ఇలాగే వుంటుంది. ఆ క్యారెక్టర్ సినిమాలో చాలా రఫ్ గా, రా గా వుంటుంది. తెలుగులో ఈ క్యారెక్టర్‌ని ఇంకా బాగా మేకోవర్ చేసి వరుణ్ తేజ్ ను ఊరమాస్ గా చూపించబోతున్నట్లు హాట్ న్యూస్. కంచె, ఫిదా, అంతరిక్షం, ఎఫ్-2.. ఇలా మంచి సినిమాలతో క్లాస్ హీరోగా పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు ఈ కొత్త లుక్ తో ఎలా చేయబోతున్నాడో చూడాలి అన్న ఆసక్తి మెగా ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలోను నెలకొంది.

Related posts