మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన “లూసిఫర్” చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ దాదాపుగా వందకోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. దానికి కారణం ఏంటంటే… మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఆ సినిమా హక్కులు దక్కించుకోవడమే. ఈ సినిమాను చెర్రీ తెలుగులోకీ రీమేక్ చేయబోతున్నాడు. అయితే ఈ రీమేక్‌లో హీరోగా నటించేది ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే “లూసిఫర్” మెగాస్టార్ శైలికి పూర్తి భిన్నంగా సాగుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్, పాటలకు సినిమాలో అవకాశం ఉండదు. పూర్తి సీరియస్‌గా పొలిటికల్ టచ్‌తో సాగుతుంది. దీంతో ఈ సినిమా హక్కులను పవన్ కల్యాణ్ కోసమే తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. బాబాయి పవన్ కల్యాణ్ హీరోగా ఓ సినిమా నిర్మించాలని చెర్రీ అనుకుంటున్నట్టు సమాచారం. అందుకోసమే “లూసిఫర్” హక్కులను చెర్రీ తీసుకున్నాడని తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మరోవైపు చిరంజీవి ప్రధాన పాత్రలో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “సైరా” చిత్రం రేపు భారీ ఎత్తున విడుదల కాబోతోంది.
previous post
ఏపీ ప్రభుత్వానికి ఎప్పుడూ చంద్రబాబు ఇల్లు ముంచాలనే తపనే..