telugu navyamedia
సినిమా వార్తలు

రిలేషన్ షిప్ మాత్రమే… పెళ్లి కాదు.. : అర్జున్ కపూర్

Arjun-Kapoor

బాలీవుడ్ హీరోయిన్ మ‌లైకా అరోరా, హీరో అర్జున్ కపూర్ రిలేష‌న్ షిప్‌లో ఉన్నట్టు ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవలే అర్జున్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా మలైకా తాము రిలేషన్ లో ఉన్న విష‌యం వాస్త‌వ‌మేన‌ని స్పష్టం చేసింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్ల నుంచి విమర్శలు కురిశాయి. ఎందుకంటే అర్జున్ కంటే వ‌య‌సులో దాదాపు 12 ఏళ్లు పెద్దది మలైకా. అంతేకాదు ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మలైకా కూడా నెటిజన్లకు ధీటుగానే సమాధానం ఇచ్చింది. భ‌ర్త అర్భాజ్ ఖాన్‌తో విడాకుల‌కు పూర్వ‌మే మ‌లైకా, అర్జున్‌తో ప్రేమ‌లో ప‌డింద‌నే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అర్భాజ్ నుంచి విడాకులు తీసుకోగానే అర్జున్‌తో క‌లిసి మ‌లైకా బ‌హిరంగంగానే క‌లిసి తిర‌గ‌డం ప్రారంభించింది. తాజాగా అర్జున్ కూడా స్పందించాడు. తామిద్దరం బంధంలో ఉన్న మాట వాస్తవమేన‌ని, అయితే తమ‌కు పెళ్లి చేసుకునే ఉద్దేశం మాత్రం లేదని అర్జున్ స్ప‌ష్టం చేశాడు.

Related posts