telugu navyamedia
సినిమా వార్తలు

సరికొత్త లుక్ తో షాకిస్తున్న కంగనా

Kangana-Ranauth

గత కొంతకాలంగా బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ కాంట్ర‌వ‌ర్సీస్‌తో ఎప్పుడు వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంటుంది. ఆ మ‌ధ్య మ‌ణిక‌ర్ణిక అనే చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న కంగనా ప్ర‌స్తుతం తెలుగు డైరెక్టర్ ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెర‌కెక్కిన “జడ్జిమెంటల్ హై క్యా” చిత్రంలో న‌టించింది. ఇందులో రాజ్ కుమార్ రావ్ హీరోగా న‌టించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఇక ఈ చిత్రం తరువాత అశ్విన్ అయ్యర్ తివారి దర్శకత్వంలో “పంగా” అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించనుంది కంగనా. వీటితో పాటు కంగ‌నా, ర‌జ‌నీష్ రాజి ఘాయ్ ద‌ర్శ‌క‌త్వంలోను “ధాక‌డ్” అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతుంది. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో కంగ‌నా మంట‌ల మ‌ధ్య నిలుచొని రెండు గ‌న్స్ ప‌ట్టుకొని ఉంది. ఈ లుక్‌ 2001లో ఏంజెలినా జోలి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన‌ “టాంబ్ రైడ‌ర్”ను పోలి ఉంది. “ధాక‌డ్” చిత్రాన్ని సోహైల్ మాక్లాయ్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో లో షూటింగ్ మొదలుకానున్నట్టు తెలుస్తోంది.

Related posts