telugu navyamedia
సినిమా వార్తలు

55 సంవత్సరాల “నిండు సంసారం”

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన మరొక సాంఘిక చిత్రం నవశక్తి ప్రొడక్షన్స్ “నిండు సంసారం”
05-12-1968 విడుదలయ్యింది. ఎల్. లింగశేట్టి సమర్పణలో నిర్మాత పి.గంగాధరరావు నవశక్తి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ  దర్శకుడు  సి.ఎస్.రావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈచిత్రానికి మాటలు: పినిశెట్టి, కథ,స్క్రీన్ ప్లే: నవశక్తి యూనిట్, పాటలు: సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, సంగీతం: మాస్టర్ వేణు, సినిమాటోగ్రఫీ: జె.సత్యనారయణ, కళ: వి.సూరన్న, నృత్యం: చిన్ని, సంపత్, ఎడిటింగ్: ఎస్.పి.ఎస్.వీరప్ప అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, ఎస్.వరలక్ష్మి, విజయలలిత, రేలంగి, నాగయ్య, పద్మనాభం, ప్రభాకర రెడ్డి, అనిత, రమణారెడ్డి, జగ్గారావు, వంగర బాలకృష్ణ, హేమలత, రమాప్రభ, డబ్బింగ్ జానకి, తదితరులు నటించారు.

ప్రఖ్యాత సంగీత దర్శకుడు మాస్టర్ వేణు గారి సంగీత సారథ్యంలో పాటలు అన్ని హిట్ అయ్యాయి.
“ఎవరికి తలవంచకు ఎవరినీ యాచించకు”
“నాకన్నులు నీకో కథ చెప్పాలి”
“వయసుతో పని ఏముంది మనసులోనే అంతా ఉంది”
“ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే”
“దేవుడున్నాడా,ఉంటే నిదురపోయాడా”
“మై డియర్ తులశమ్మక్కా..క్కా..క్కా”
వంటి మధురమైనపాటలు శ్రోతలను అలరించాయి. ఈ చిత్రం ద్వారా నూతన నటి అనిత తెలుగు తెరకు పరిచయం అయింది.

Related posts