దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో సీత పాత్రలో రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామ పాత్రలో హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంది. అయితే..ఇప్పటికే ఎన్టీఆర్ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ రికార్డులను కూడా బ్రేక్ చేస్తోంది. అయితే.. ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ పైన కూడా చాలా వార్తలు వస్తున్నాయి. తాజాగా పూరిజగన్నాథ్ హీరోయిన్ పేరు కూడా వినిపిస్తోంది. పూరి తనయుడు ఆకాష్ పూరి నటిస్తున్న రొమాంటిక్ సినిమాతో కేతిక శర్మ తెలుగులో పరిచయం అవుతోంది. ఈ హీరోయిన్‌నే ఎన్టీఆర్ సరసన నటించబోతుందని టాలీవుడ్ లో టాక్ వస్తోంది. ఆ హీరోయిన్ కోసం త్రివిక్రమ్ కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాడని సమాచారం. అయితే.. దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.