telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్జీవీ మిస్సింగ్… మరో సంచలన సినిమాను ప్రకటించిన వర్మ

RGV

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ‘క్లైమాక్స్’, ‘నగ్నం’, ‘పవర్ స్టార్’ సినిమాలను వర్మ విడుదల చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు “మర్డర్”, “థ్రిల్లర్” అంటూ మరో రెండు సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి రెడీగా ఉన్నాడు. వర్మ ఇప్పుడు మరో సినిమాను అనౌన్స్ చేసాడు. ఫిక్షనల్ రియాలిటీ (FR) “ఆర్జీవీ మిస్సింగ్” అనే సినిమా తీయనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. తన ట్విటర్ లో వర్మ ”ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీసులు షాకింగ్ నిజాలు బయటపెడతారు. ఈ సినిమాలో ఈ పాత్రలు… ప్రవన్ కళ్యాణ్, ఒమేగా స్టార్, సీబెఎన్, లాకేష్, WHY S జగన్, KCAR, KTAR. అలాగే ఇందులో కాప్స్, గ్యాంగ్‌స్టర్లు, ఫ్యాక్షనిస్టులు కూడా నటించనున్నారు. ఈ ఎఫ్‌ఆర్ సినిమా కోసం వేచి ఉండండి. ఈ సినిమా వాస్తవిక కథనాల ఆధారంగా తీసుకోబడిన పాత్రలతో ఉంటుంది. ఈ సినిమాలో ఆర్జీవీ మిస్సింగ్ అని తెలిసిన అతని స్టాఫ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. దీనిని పోలీసులు మొదట్లో డైరెక్టర్ పబ్లిసిటీ అని భావిస్తారు. కానీ ఆ తర్వాత నిజం అని తెలుస్తుంది. అయితే ఈ కేసులో నిందితులు ముగ్గురు… 1. పవర్ ఫుల్ స్టార్ అభిమానులు 2. ముంబై అండర్ వరల్డ్ కు కాంట్రాక్ట్ ఇచ్చిన మెగా ఫ్యామిలీ 3. ఫ్యాక్షనిస్టుల సహాయం తీసుకునే ఒక మాజీ ముఖ్యమంత్రి, అతని కుమారుడు” అంటూ స్టోరీ లైన్ కూడా చెప్పేశాడు వర్మ. దీంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి కలుగుతోంది.

Related posts