telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘రొమాంటిక్’ను రొమాన్స్ తో ముగించబోతున్న డైరెక్టర్…

romantic

పూరి జగన్నాథ్ కుమారుడు పూరి ఆకాష్ హీరోగా ‘రోమాంటిక్’ పేరుతో ఓ కొత్త సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యువ డైరెక్టర్ అనిల్ పాదూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఆకాష్ పూరికి జంటగా ఉత్తరాది భామ కేతిక శర్మ నటిస్తోంది. రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చాలా వరకు గోవాలో చిత్రీకరణ జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా క్లైమాక్స్ లో లిప్ టు లిప్ కిస్ సీన్ ఉందట. సినిమా చివరి షాట్ కిస్ తోనే ఎండ్ అవుతుందని తెలుస్తోంది. మొత్తానికి ‘రొమాంటిక్’ను రొమాన్స్ తో ముగించబోతున్నారు అన్నమాట. ఈ సినిమాకు సంబందించి ఆ మధ్య ఓ పోస్టర్‌ను, టీజర్‌ను కూడా చిత్రబ‌‌ృందం విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ను పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మిలు కలిసి నిర్మిస్తున్నారు.

Related posts