telugu navyamedia
సినిమా వార్తలు

రామ్ గోపాల్ వర్మ ప్రేమాయణం…

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ వివాదాల్లో నిలవడం ఆయ‌న‌ స్పెషాలిటీ. మనసులో అనుకుంటున్న మాటలను బయటకు చెప్పెస్తూ.. ఈ సారి కొత్తగా వైరల్‌ అవుతున్నాడు.

ఇటీవలే ఇనయా సుల్తానా అనే ఆ బర్త్ డే బేబీతో కేక్ కట్ చేపించి, రంగీలా మూవీలోని మసాలా పాటకి మద్యంమత్తులో చిందులేసి వర్మ నానా హంగామా చేశారు.. ఎక్కడెక్కడో తాకుతూ ఆ అమ్మాయి కాళ్ళకి నమస్కారం కూడా పెట్టి షాక్ ఇచ్చాడు వర్మ. ఇక అక్కడే ఉన్న మరో సినీ నటి జ్యోతితో కూడా రెచ్చిపోయి నృత్యాలు చేశాడు. ఇంత నీచంగా అమ్మాయిలతో సరసాలు అంటూ కామెంట్స్ పెడుతున్న నెటిజన్స్ పై వర్మ కౌంటర్ ఇచ్చాడు.

ఆ ఇద్దరికీ లేని ఇబ్బంది ఈ మూడో వాడికి ఏంటి ?’ అంటూ వర్మ తనదైన శైలిలో లాజిక్ మాట్లాడారు. దీంతో నెటిజన్స్ కూడా వర్మకి సపోర్ట్ గా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. గజ్జికి లేని దురద జాలీమ్ లోషన్ కి ఎందుకు అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా ఈ వీడియోలో ఉన్నది తాను కాదని, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మీద ఒట్టేసి చెప్పాడు.

అయితే తాజాగా వర్మ తన తొలిప్రేమ గురించి చెప్పుకొచ్చాడు. తాజాగా తను కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించానని.. అంతేగాక బీచ్ తీరాన స్విమ్‌సూట్‌లో ఉన్న సత్య ఫొటోలను తన ట్వీట్‌లలో షేర్‌ చేశాడు.

Image

తనే ఫస్ట్ లవ్ అంటూ ఆమెకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు .ఆమె పేరు పోలవరపు సత్య అని.. ఆమె మెడిసిన్ చేసినట్లుగా చెప్పాడు. తను విజయవాడలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివే రోజుల్లో సత్య సిద్ధార్థ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేసిందని చెప్పుకొచ్చాడు.

అవి రెండు క్యాంపస్‏లు ఒకేచోట ఉండడంతో రోజు సత్యను చూసేవాడినని.. అలా తనతో ప్రేమలో పడినట్లుగా చెప్పాడు. కానీ ఆమె డబ్బున్న మరో వ్యక్తి ప్రేమలో ఉన్న కారణంగా తనను పట్టించుకునేది కాదే భావనలో ఉండేవాడినని అలా ‘రంగీలా’ మూవీ స్టోరీ పుట్టిందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం సత్య అమెరికాలో మెటర్నిటీ డాక్టర్‌గా పని చేస్తున్నట్లు వర్మ ల‌వ్ స్టోరీ చెప్పుకొచ్చాడు. 

Related posts