telugu navyamedia
సినిమా వార్తలు

“రాధే”లో సల్మాన్ ఖాన్ ఫస్ట్ లుక్

Radhe

ఇండియ‌న్ మైకేల్ జాక్సన్ ప్ర‌భుదేవా ద‌ర్శ‌కుడిగా బాలీవుడ్ లో వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా మారారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో స‌ల్మాన్‌తో క్రేజీ ప్రాజెక్ట్‌లు రూపొందిస్తున్నాడు. ఇప్ప‌టికే స‌ల్మాన్ – ప్ర‌భుదేవా కాంబినేష‌న్‌లో వ‌చ్చిన “వాంటెడ్” చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో రీసెంట్‌గా “ద‌బాంగ్ 3” చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ చిత్రం క్రిస్మస్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా… ప్ర‌భుదేవా- స‌ల్మాన్ కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రంగా “రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్” తెరకెక్కుతోంది. 2017లో వ‌చ్చిన కొరియ‌న్ చిత్రం “ది ఔట్ లాస్‌”కి రీమేక్‌గా “రాధే” మూవీ తెర‌కెక్క‌నున్న‌ట్టు స‌మాచారం. 2020 ఈద్‌కి ఈ చిత్రం విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. బ్లాక్ జాకెట్‌లో, గాగుల్స్‌తో గన్ పట్టుకుని కాల్పులు జరుపుతున్నట్లుగా సల్మాన్ ఫస్ట్‌లుక్‌లో కనిపించారు. అయితే ఇందులో కొత్తదనం ఏమీ కనిపించడంలేదు. సల్మాన్ నటించిన వాంటెడ్, దబాంగ్‌, రేస్ 3 సినిమాలోనూ ఇలా సల్మాన్ గన్ పట్టుకుని కనిపించారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్‌పై సల్మాన్, అతని సోదరుడు సొహైల్ ఖాన్, బావమరిది అతుల్ అగ్నహోత్రి సంయుక్తంగా నిర్మి్స్తున్నారు. మెహబూబ్ స్టూడియోస్‌లో నవంబర్ 4 నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది. కంటిన్యుయస్‌గా నెల రోజుల పాటు సినిమాను షూట్ చేయనున్నారు. ఆ తర్వాత సల్మాన్, ప్రభుదేవా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దబాంగ్ 3’ ప్రమోషన్స్‌లో పాల్గొంటారు.

Related posts