telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవర్ స్టార్ : ‘గడ్డి తింటావా’ సాంగ్… విడుదలైన 5 గంటల్లో సుమారుగా 5 లక్షల వ్యూస్

Power-Star

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సెటైరికల్‌గా ఒక చిన్న సినిమాను రూపొందిస్తున్నారు వర్మ. దీనికోసం పవన్ కళ్యాణ్‌లా ఉండే ఒక టిక్ టాక్ ఆర్టిస్ట్‌ను కూడా పట్టుకొచ్చారు ఈ వివాదాస్పద దర్శకుడు. ఈ సినిమాకు ‘పవర్ స్టార్ – ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ అని టైటిల్ పెట్టారు. అంతేకాదు, పవర్ స్టార్ టైటిల్ లోగోలో జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసును కూడా ఉంచారు. అయితే ఈ సినిమా నుంచి ఒక పాటను ఆదివారం సాయంత్రం వర్మ విడుదల చేశారు. ‘గడ్డి తింటావా’ అంటూ సాగే ఈ పాట కూడా సెటైరికల్‌గానే ఉంది. పవన్ కళ్యాణ్ వాయిస్ మాడ్యులేషన్‌లోనే ఈ పాటను పాడారు. పవన్ పాత్రధారే పాడినట్టు వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సాహిత్యం ఎవరు అందించారో తెలీదు కానీ, చాలా వెటకారం జోడించారు. ‘‘మనుషులనే నమ్మి మోసపోయాను. ఓటేశారనుకుంటే వెన్నుపోటేశారు’’ అంటూ సాగుతోంది ఈ పాట. ఆర్జీవీ ఫ్యాన్స్, పవన్ యాంటీ ఫ్యాన్స్ నుంచి ఈ పాటకు మంచి స్పందనే వస్తోంది. పాట విడుదలైన 5 గంటల్లో సుమారుగా 5 లక్షల మంది వీక్షించారు. యూట్యూబ్‌లో ఈ పాటకు 38 వేలకు పైగా లైకులు రాగా.. 21 వేలకు పైగా డిజ్‌లైకులు వచ్చాయి. ఇదిలా ఉంటే, ఈ సినిమా ట్రైలర్‌ను చూపించడానికి కూడా ఆర్జీవీ డబ్బులు వసూలు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక సినిమా ట్రైలర్‌ను డబ్బులు పెట్టి చూడటం ఇదే తొలిసారి. ‘పవర్ స్టార్’ ట్రైలర్ చూడాలంటే రూ.25 చెల్లించాలని వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ సినిమాను ఈనెల 25న ఉదయం 11 గంటలకు ఆర్జీవీ వరల్డ్ థియేటర్ వెబ్‌సైట్‌లో విడుదల చేస్తున్నారు. టిక్కెట్ ధర రూ.150.

Related posts