కోలీవుడ్‌లో దర్శకుడు వెట్రిమారన్, ధనుష్ కాంబినేషన్ అంటేనే వైవిధ్యమైన సినిమాను తెరకెక్కిస్తారనే అంచనాలు బోలెడు ఉంటాయి. వీరి కాంబినేషన్‌లో తాజాగా నాలుగో చిత్రంగా ‘అసురన్’ రూపొందింది. సూపర్‌స్టార్ రజినీకాంత్ అల్లుడు, తమిళ ప్రముఖ హీరో ధనుష్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. మలయాళ సీనియర్ నటి మంజు వారియర్ ఈ చిత్రం ద్వారా తమిళంలోకి అడుగు పెట్టారు. ప్రకాశ్‌రాజ్, పశుపతి, పవన్, యోగిబాబు, ఆడుగలం నరేన్, తలైవాసల్ విజయ్, గురు సోమసుందరంలు, దర్శకులు బాలాజీ శక్తివేల్, సుబ్రహ్మణ్య శివలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల నాలుగో తేదీన విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ‘అసురన్’ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. ఈ మధ్య కాలంలో కేవలం కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే చేస్తున్న హీరో వెంకటేష్.. ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నారు. తెలుగు వర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. తాజాగా ఈ మూవీ బాలీవుడ్ లో సైతం రిమేక్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ మద్య అసురన్ మూవీ చూసి బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ చాలా ఇంప్రెస్ అయినట్లు సమాచారం. అందుకే ఈ మూవీ హిందీలోకి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారని బీటౌన్ టాక్. ఇప్పటికే షారుక్ తమిళ దర్శకుడు అట్లీతో కూడా ఒక సినిమా చేయాలనుకుంటున్నారనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
next post