telugu navyamedia
సినిమా వార్తలు

68 సంవత్సరాల ఎన్ .టి .ఆర్ “పెంకి పెళ్ళాం”.

నటరత్న ఎన్.టి.రామారావు నటించిన సాంఘిక చిత్రం సాహిణీ ఆర్ట్స్ వారి “పెంకి పెళ్ళాం” ఈ సినిమా 6 డిసెంబర్ 1956 లో విడుదలైంది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో డి.బి.నారాయణ, యస్. భావనారాయణలు సాహిణీ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు.

ఈ చిత్రంలోఎన్.టి. రామారావు, రాజసులోచన, శ్రీరంజని, పద్మనాభం, సూర్యకాంతం, ఛాయాదేవి, రేలంగి, రమణారెడ్డి, జోగారావు, అమరనాథ్, పెరుమాళ్లు, నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ , పేకేటి శివరాం, ఇ.వి.సరోజ, హేమలత, రత్నపాప, తదితరులు నటించారు.
ఈ చిత్రానికి మాటలు: ఆరుద్ర, పాటలు: ఆరుద్ర, వి.వి.ఎల్.ప్రభాకర్, సంగీతం: కె.ప్రసాదరావు, కెమెరా: డి.ఎల్.నారాయణ, కళ: గోడ్ గాంకర్, నృత్యం: అనిల్ కుమార్ చోప్రా, వెంపటి సత్యం అందించారు.

సంగీత దర్శకుడు కె.ప్రసాదరావు గారి సంగీత సారధ్యంలో
“పడుచు దనం రైలు బండి పోతున్నది,
వయసవాళ్ళకందులో చోటున్నది”
“లేదు సుమా..లేదు సుమా..అపజయమన్నది లేదు సుమా,”
“నన్ను పెండ్లాడవే చెంచీతా, శ్రీకృష్ణమూర్తినే చెంచీతా”,
“చల్ చల్ గుర్రం,చలాకి గుర్రం,చలాకి పిల్లల సవారి గుర్రం”
వంటి పాటలు ఆరోజుల్లో శ్రోతలను ఆకట్టుకున్నాయి .

Related posts