ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం తరువాత పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. 1870 నాటి పరిస్థితుల నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా క్రిష్ అద్భుత కథను రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనుండగా.. ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పవర్ ఫుల్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక ఈ సినిమాలో పవన్‌కి జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించనుంది. అయితే ఈ సినిమాలో 1870 నాటి పరిస్థితుల్ని ఆవిష్కరిస్తూ.. అప్పట్లో ఆచరణలో ఉన్న దేవదాసి వ్యవస్థను ఈ సినిమాలో చూపించబోతున్నారట క్రిష్. అయితే ఈ దేవదాసి పాత్ర కోసం బిగ్ బాస్ బ్యూటీ పునర్నవిని తీసుకున్నట్టు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పునర్నవి పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండటంతో వెంటనే ఓకే చెప్పేసిందట. అయితే పునర్నవి కాని.. చిత్ర యూనిట్ కాని దీన్ని దృవీకరించలేదు కాని.. పవన్ సినిమాలో పునర్నవి అనే వార్త వైరల్ అవుతోంది.
previous post
సౌత్‌లో హీరోలను చూడటానికే థియేటర్స్‌కు వస్తారు : రకుల్ ప్రీత్ సింగ్