telugu navyamedia
సినిమా వార్తలు

ఆస్కార్ అవార్డు 2021కు “కూజన్గల్ ” ఎంపిక..

2021 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు కోసం భారత దేశం నుంచి  “కూజన్గల్ త‌మిళ మూవీ ” ఎంపికయ్యింది .

మన దేశం నుంచి ప్రతి సంవత్సరం ఆస్కార్ అవార్డు కోసం ఒక సినిమాను ఎంపిక చేస్తారు . దేశంలోని అన్ని భాష చిత్రాలు ఈ అవార్డు కోసం పంపిస్తారు . ఫిలిం ఫెడరేషన్ అఫ్ ఇండియా సంస్థ ఈ ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ అవార్డు కోసం వచ్చిన చిత్రాలను చూసి ఎంపిక చెయ్యడానికి సినిమా రంగ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది .

ఈ సంవత్సరం మలయాళ దర్శకుడు షాజీ కరుణ్ చైర్మన్ గా ఒక కమిటీని నియమించింది. ఇందులో రవీంద్ర జాదవ్ , విపుల్ మెహతా, శ్రీమతి రుమా సేన్ గుప్తా , భగీరథ , షణ్ముగం ,నవనీయత్ సింగ్ ,ఇంద్రదీప్ దాస్ గుప్త , నటి అనన్య ఛటర్జీ , సుమిత్ బసు , కె ఉమామహేశ్వర రావు , అర్ఘ్యకమల్ మిత్ర,పంపల్లి , నాగన్న, సుకుమార్ సభ్యులుగా వున్నారు.

ఆస్కార్ అవార్డు కోసం ఈ సంవత్సరం 14 సినిమాలు వచ్చాయి .

*షేర్ షా ” (హిందీ )

*మండేలా “(తమిళం )

*” షెర్ని ” (హిందీ )

*ఆట వెల్ జాలి “( మరాఠీ )

*కూజన్గల్ “(తమిళం )

*”కాగజ్ ” ( హిందీ )

*”బ్రిడ్జి ” (అస్సామీ )

*”తూఫాన్ ” హిందీ )

*చెల్లో షో ” ( గుజరాతీ )

*”గోదావరి “(మరాఠీ )

*”సర్దార్ ఉద్ధం ” ( హిందీ )

*కారఖాని సంచి వారి “(మరాఠీ )

*”నాయత్తు “(మలయాళం )

*”లైలా ఔర్ సత్ గీత్ ” (గోజ్రీ )

ఈ సంవత్సరం తెలుగు, కన్నడ సినిమాలు రాలేదు.

కలకత్తా లో వారం రోజులపాటు 14 ఈ సినిమాలను చూసిన కమిటీ “కూజన్గల్ త‌మిళ మూవీ “ను ఎంపిక చేసింది . శనివారం కోల్ కతా లోని లలిత్ గ్రేట్ ఈస్టర్న్ హోటల్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కమిటీ చైర్మన్ షాజీ ఆస్కార్ అవార్డు కోసం భారత దేశం నుంచు కూజన్గల్ ” త‌మిళ మూవీను ఎంపిక చేసినట్టు ప్రకటించారు . ఈ సమావేశంలో కమిటీ సభ్యులు , ఎఫ్ .ఎఫ్ .ఐ ప్రతినిధులు సుప్రసేన్ , అనింద్య దాస్ గుప్తా పాల్గొన్నారు .
– భగీరథ
కోల్ కతా నుంచి . .

Related posts