telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సెక్సీగా కనిపించే దుస్తుల్లో రమ్మన్నాడు… ప్రముఖ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Rees

ప్రముఖ హాలీవుడ్ నటి రీస్ విదర్‌స్పూన్ 23 ఏళ్ల వయసులో ఓ ఆడిషన్ కంపెనీ ఓనర్ తనను సెక్సీగా కనిపించే దుస్తుల్లో రమ్మన్నాడని తాజాగా షాకింగ్ విషయాలు చెప్పారు. “నాకు 23 ఏళ్లు ఉన్నప్పుడు ఓ ఆడిషన్ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. అప్పటికే నేను ‘ఎలెక్షన్’ అనే సినిమాలో నటించాను. అందులో నేను టామ్ బాయ్‌లా కనిపిస్తాను. దాంతో నన్ను తర్వాతి సినిమాలో తీసుకోవాలంటే ఓ ఆడిషన్ కంపెనీ ఓ షరతు పెట్టింది. ఆడిషన్ ఆఫీస్‌కి వచ్చేముందు సెక్సీగా దుస్తులు వేసుకుని రావాలని చెప్పారు. అప్పుడే నాకు సినిమాలో ఛాన్స్ ఉంటుందని అన్నారు. ఇప్పుడున్న హీరోయిన్లు ఇలాంటి ఘటనలు ఎదుర్కొంటే రచ్చ చేసేవారు. కానీ అప్పట్లో నేను ఏమీ చేయలేని పరిస్థితి. అప్పటికే నేను ఓ బిడ్డకు తల్లిని. ఇంటిని చూసుకోవడానికి డబ్బు కావాలి. అప్పట్లో నేను ఎదుర్కొన్న సంఘటనలు ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తోంది. ఇప్పుడు నా కూతురిని ఎవరన్నా అలా సెక్సీగా డ్రెస్ వేసుకుని రావాలని చెబితే ‘మీరు జోక్ చేస్తున్నారు కదా’ అనేస్తుంది” అని తెలిపారు.

16 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమలోకి వచ్చి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు ప్రముఖ రీస్ విదర్‌స్పూన్. చిన్న వయసులోనే ఓ దర్శకుడు తనను లైంగికంగా వేధించాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. “16 ఏళ్ల వయసులో ఓ డైరెక్టర్ నన్ను లైంగికంగా వేధించాడు. ఈ విషయం తెలిసి ఏజెంట్స్, ప్రొడ్యూసర్స్ నా నోరు నొక్కేశారు. అదొక్కటే కాదు నా కెరీర్‌లో చాలా సార్లు లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను. ఆ సమయంలో నేను ఈ విషయాలను బయటపెట్టనందుకు ఇప్పటికీ చింతిస్తున్నాను. ఆ సమయంలో ఎందుకు చెప్పలేకపోయానంటే.. నోరు విప్పితే ఎక్కడ నాకు పనిలేకుండా పోతుందోనన” అని అన్నారు.

Related posts