telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు కొడాలి నాని ఘాటు కౌంటర్

kodali nani ycp

టీడీపీ నేత అచ్చెన్నాయుడు తనపై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత కొడాలి నాని ఘాటు కౌంటర్ ఇచ్చారు. తనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చమని చెప్పిన అచ్చెన్నాయుడిని ఏదైనా వెటర్నరీ ఆసుపత్రిలో చేర్చితే మంచిదని హితవుపలికారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఒక మానసిక వైకల్య కేంద్రాన్ని ఇచ్చినట్టు తమ సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి చెబితే విన్నానని అన్నారు.

ఆ ఆసుపత్రిని అమరావతిలో ‘శ్రీ నారా చంద్రబాబునాయుడు మానసిక వైకల్య కేంద్రం’గా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ను కోరుతున్నానంటూ ఎద్దేవాచేశారు. ఆ ఆసుపత్రిలో మొట్టమొదటి పేషెంట్ గా చంద్రబాబుని, ఆయనతో పాటు పిచ్చెక్కితిరుగుతూ మార్షల్స్ ను కొడుతున్న వాళ్లనూ ఈ ఆసుపత్రిలో చేర్చాలంటూ చేసిన వ్యాఖ్యలకు అధికారపక్ష సభ్యులు నవ్వుల్లో మునిగిపోయారు.

Related posts