వైసీపీ అధినేత వైస్ జగన్‌పై విశాఖపట్టణం విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి చేసిన జనుపల్లి శ్రీనివాస్ నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా ఉంటున్న శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతడికి బెయిలు ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాది ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేశారు. స్పందించిన కోర్టు కొంత పూచికత్తుతో గురువారం బెయిలు మంజూరు చేసింది.
జైలు అధికారులకు కోర్టు మంజూరు చేసిన బెయిలు ఆర్డర్ శుక్రవారం సాయంత్రం వరకు అందలేదు. దీనితో అతడు నేడు (శనివారం) విడుదలయ్యే అవకాశం ఉంది. జగన్‌పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు ఈ ఏడాది జనవరి 18 నుంచి రాజమండ్రి కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉంటున్నాడు.
పార్టీలో అందరి కంటే సీనియర్ నేనే.. తనకన్నా విధేయుడు ఎవరున్నారు: వీహెచ్