ప్రేమ గీతిక ఆలపించే
ప్రేమ కౌముది వృష్టి చేసే
ప్రేమ కావ్యం రచన సలిపే
ప్రేమ దేవీ స్వాగతాంజలి-
ప్రణయ సుధలే చిలుకరించే
ప్రణయ వీణా రాగ మయ్యే
ప్రణయ కోపం పలుకరించే
ప్రణయ రాణీ! సదా అంజలి!
వలపు తలపుల విరుల బోణీ-
వలపు సిరివిల మౌక్తిక మణీ-
వలపు ప్రకృతికి నీవె ఆమని-
వలపు శరమా! పరిమళాంజలి-
అమర ప్రేమకు హద్దు లేదుగ
ఆది నుండీ ఓకే శ్వాసగ
ఇలను పొంగే ప్రణయ జలధిన
ఈదులాడే నీవు నేనూ
ప్రణయ సాగర తరంగాలం!
-అంశుమాలి, టెక్కలి
ఈ ముగ్గురికీ గుర్తింపు లభించడం లేదు… మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్