అజిత్ ఇటీవలే “నెర్కొండ పార్వాయి” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఖాకీ ఫేం హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగాగా, శ్రద్ధా శ్రీనాథ్, అభిరామి వెంకటచలం, ఆండ్రియా తరియంగ్‌లు ముఖ్య పాత్రలలో కనిపించారు. లాయర్ పాత్రలో అజిత్ కనిపించి మెప్పించాడు. బోని కపూర్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం పింక్ రీమేక్ చిత్రంగా రూపొందిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి “నెర్కొండ పార్వాయి” టీంతో కలిసి తన 60వ చిత్రం చేయబోతున్నాడు అజిత్. అజిత్ 60వ చిత్రం వినోద్ దర్శకత్వంలో తెరకెక్కనుండగా, ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించనున్నారు. వాలిమై” అనే టైటల్‌ని చిత్రానికి ఫిక్స్ చేసిన టీం మూవీని 2020 సమ్మర్‌లో విడుదల చేయనున్నారు. యువన్ శంకర్ రాజా బాణీలు సమకూర్చనున్నాడు. ఈ సినిమాలో ఇలియానాకు అవకాశం వచ్చింది. ముందుగా ఈ పాత్రకు యామీ గౌతమ్‌ను తీసుకోవాలని భావించినా ఫైనల్‌గా ఇలియానాను తీసుకున్నారు చిత్రయూనిట్. మరి ఈ సినిమాతో అయిన ఇలియానా కెరీర్ గాడిలో పడుతుందేమో చూడాలి.
previous post