telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వెంకీ చేతుల మీదుగా ‘నరసింహపురం’ టీజర్

గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై.. పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో టి.ఫణిరాజ్ గౌడ్- నందకిశోర్ ధూళిపాలతో కలిసి శ్రీరాజ్ బళ్లా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా మారుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా.. వర్ధమాన నటి ఉష హీరో చెల్లెలు పాత్రలో నటించారు. వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ… అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో అత్యద్భుతంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.   తాాజాగా ఈ చిత్రం టీజర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్న నంద కిషోర్ హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. తమ చిత్రం ట్రైలర్ ను వెంకటేష్ చేతుల మీదుగా విడుదల చేయడం పట్ల దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు.

Related posts