telugu navyamedia
సినిమా వార్తలు

ఆ ముగ్గురు బాగుంటేనే మొత్తం ఇండస్ట్రీ బాగుంటుంది..

సినిమా అంటే సినిమా తీసేవాడు, సినిమా చూపించేవాడు, చూసేవాడుంటేనే ఆ ముగ్గురు బాగుంటేనే మొత్తం ఇండస్ట్రీ బాగుంటుందని ..ఈ సినిమా ప‌రిశ్ర‌మ మీద కొట్లాది మంది ఆధార‌ప‌డి బ్ర‌తుకుతున్నార‌ని దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

హైదరాబాద్​లో సోమవారం నిర్వహించిన ‘శ్యామ్ సింగరాయ్’ సక్సెస్​మీట్​లో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్​లో థియేటర్లు మూస్తుంటే ఏడుపొస్తుందని అన్నారు..తెలుగు ఫిల్మ్ పెద్దలందరికీ ..

యజమానులారా.. థియేటర్లు మూసేయొద్దు అని నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే లను ఎంపీలను థియేటర్స్ యజమానులు కలవమని సూచించారు. యజమానులు.. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తేవాలని నారాయణమూర్తి చెప్పారు.

ఈ విషయంలో తెలుగు నిర్మాతల మండలి, ‘మా’ జోక్యం చేసుకోవాలని పేర్కొన్నారు. సినీ పరిశ్రమను కాపాడుకోవాలని , పండగ వేళ సినీ పరిశ్రమకు గడ్డు పరిస్థితి రావొద్దని అన్నారు.

ప్రస్తుత పరిస్థితులపై సినీ పరిశ్రమ పెద్దలు దృష్టిపెట్టాలని కోరారు. అంతేకాదు సినిమా వారి ఆవేద‌న ఏంటి, వారి ఆవేశం ఏంటి తెలుసుకోవాల‌ని జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాన‌ని.. మళ్లీ థియేటర్స్ ఓపెన్ చేయండని చెప్పారు. సినీ ప‌రిశ్ర‌మ మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా ఉంద‌ని అన్నారు.

Related posts