telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రొమాన్స్

kathrina-kaif-and-mahesh-babu

ప్రస్తుతం మహేష్ బాబు తన 25వ చిత్రమైన “మహర్షి” షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే మే నెలలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. మే నెలలో షూటింగ్ ను స్టార్ట్ చేసి… సినిమాలో మహేష్ బాబుతో సంబంధం లేని సన్నివేశాలను చిత్రీకరిస్తారట. సుకుమార్ కు మహేష్ బాబు జూన్ నుంచి వరుసగా డేట్లు ఇవ్వడంతో ఆ సమయంలోనే ప్లాన్ చేసిన ఫారిన్ షెడ్యూల్లో మహేష్ బాబు పాల్గొంటాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా తీసుకుందామని ముందుగా భావించారు. కానీ ఇప్పుడు ఆమెను తప్పించి, మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని భావించిన సుకుమార్ ఇటీవల ఆమెను కలిసి కథను వినిపించాడట. కత్రినా కూడా ఈ విషయంపై సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం. కెరీర్ మొదట్లో బాలకృష్ణతో ఆడిపాడిన కత్రినా… ఆ తరువాత వెంకటేష్ సరసన “మల్లీశ్వరి” సినిమాలో మెరిసింది. ఇప్పుడు బాలీవుడ్ లో గ్లామర్ గాళ్ గా వెలుగొందుతున్న ఈ ముద్దుగుమ్మ గతంలోనే తెలుగులో అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ప్రకటించింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related posts