కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. గతేడాది అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆయన కున్న కోట్లాది అభిమానులు షాక్ కు గురయ్యారు.
పునీత్ రాజ్ కుమార్ టాలీవుడ్ నటులతో కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవారు. దేశ వ్యాప్తంగా సినిమా వారితో పాటు రాజకీయ నాయకులు కూడా నివాళి అర్పించారు. తాజాగా పునీత్ కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించారు. పునిత్ రాజ్ కుమార్ కు అల్లు అర్జున్ కు మంచి సానిహిత్యసంబంధాలు ఉన్నాయి. చాలా సినిమా పంక్షన్స్ లో వీళ్లిద్దరు కలిసి సందడి చేశారు.
పునీత్ మరణించిన తర్వాత ప్రత్యక్షంగా రాలేకపోయిన బన్నీ..ప్రస్తుతం వీలు చిక్కడంతో పునీత్ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. గురువారం బెంగళూరులో ఆయన కంఠీరవ స్టూడియోలోని పునీత్ సమాధిని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సదాశివనగర్‌లోని పునీత్ నివాసానికి వెళ్ళి ఆయన భార్యను ఓదార్చారు.
ఆ తర్వాత డాక్టర్ శివరాజ్ కుమార్ నివాసానికి వెళ్లారు. పునీత్ అకాల మృతి తనను తీవ్రంగా కలచివేసిందని సినిమా షూటింగ్‌లతో దూరంగా ఉన్న కారణంగానే అంత్యక్రియలకు రాలేకపోయానని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
ఇటీవల పుష్ప సినిమా రిలీజ్ ప్రమోషన్ కోసం బెంగళూరు వెళ్ళిన అల్లు అర్జున్ కు పునీత్ కుటుంబాన్ని కలుస్తారా..? అంటూ మీడియా ఆయనను ప్రశ్నించగా.. తాను తన సొంత సినిమా పని మీద వచ్చానని… సినిమా పని మీద వచ్చి అలా కలవడం మర్యాద కాదని బన్నీ చెప్పాడు. తర్వాత తాను వచ్చి పునీత్ కుటుంబాన్ని కలుస్తానని చెప్పడం జరిగింది… చెప్పినట్టుగానే బన్నీ బెంగళూరుకు వెళ్లి పునీత్ కుటుంబాన్ని కలిసి ఒదార్చారు.
అల్లు అర్జున్ మాట నిలబెట్టుకున్నాడని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
పవన్ పై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు