telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్ సరికొత్త రికార్డ్…

buttabomma

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘అల వైకుంఠపురములో’ ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ సునామీ సృష్టించడంతో పాటు నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రియేట్ చేసింది. థమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ రిలీజ్‌కి ముందు రిలీజ్ తర్వాత ఓ ఊపు ఊపాయి.. తాజాగా ‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 100 మిలియ‌న్ వ్యూస్‌తో పాటు 1 మిలియ‌న్ లైక్స్‌ను ద‌క్కించుకుందీ సాంగ్. తెలుగు పాట‌ల్లో వ‌న్ మిలియ‌న్ లైక్స్ ద‌క్కించుకున్న పాటగా ‘బుట్ట‌బొమ్మ’ సెన్సేష‌న్ క్రియేట్ చేయడం విశేషం.

Related posts