telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆదిపురుష్ : సీతగా బోల్డ్ బ్యూటీ ?

Urvasi

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రంగా ‘ఆదిపురుష్‌’ అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెరకెక్కనుంది. ‘చెడు మీద మంచి సాధించిన విజయం’ అనేది ట్యాగ్ లైన్. రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాని దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో టీ-సిరీస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సీతగా ఎవరు నటించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మొదట ఆ పాత్రలో కీర్తి సురేష్, కియారా అద్వాణీ నటిస్తుంది అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజాగా మరో పేరు తెరమీదకు వచ్చింది. ఆమె మాజీ మిస్ ఇండియా (2015) ఊర్వశి రౌటెలాను ఇందులో సీత పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్రకు ఊర్వశి బాగా సరిపోతుందని చిత్రబృందం అనుకుంటున్నట్లు తెలుస్తుంది. కానీ ఇంతవరకు ఈ భామ బోల్డ్ పాత్రలే చేయడం గమనార్హం. మరి ఇందులో నిజమెంతో చూడాలి.

Related posts