telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలకృష్ణ, బోయపాటి చిత్రం టైటిల్ లీక్…!?

BB3

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ “బిబి-3” పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన బీబీ 3 టీజర్‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్, కరోనా కారణంగా వాయిదా పడగా, త్వరలోనే తిరిగి సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాకు ఇప్పటికే పలు పేర్లు వినిపించాయి. తాజాగా మరో పేరు టాలీవుడ్ వర్గాల్లో మారుమోగుతోంది. దీనికి ‘టార్చ్ బేరర్’ అనే పేరును బోయపాటి ఖరారు చేసినట్టు సినీ వర్గాలు అంటున్నాయి. ఈ పేరు బయటకు రాగానే సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది. కాగా బాలకృష్ణతో ‘సింహా’, ‘లెజండ్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన బోయపాటి శ్రీను నిర్మిస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘బీబీ 3.

Related posts