telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

చైనా కు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న భారత్…

apps play store

చైనా కు ఇప్పటికే చాలా షోకులు ఇచ్చింది భారత ప్రభుత్వం. అయితే గత ఏడాది భారత్‌-చైనా జవాన్ల మధ్య ఘర్షణ తర్వాత.. డ్రాగన్‌ కంట్రీపై డిజిటల్ ఉద్యమానికి తెరలేపిన భారత ప్రభుత్వం… వరుసగా ఆ దేశానికి చెందిన యాప్‌లపై నిషేధం విధిస్తూ వచ్చింది… అయితే, ఇంకా ఉద్రిక్తతలు చల్లబడకపోగా.. తాజాగా మరో ఘటన కూడా చోటు చేసుకుంది.. దీంతో.. టిక్‌టాక్‌తో స‌హా 59 చైనా యాప్‌ల‌పై శాశ్వతంగా నిషేధం విధించేందుకు సిద్ధమవుతోంది భారత ప్రభుత్వం.. 7 నెల‌ల త‌ర్వాత కూడా స‌రిహ‌ద్దుల్లో చైనాతో ఘ‌ర్షణ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో సంబంధిత యాప్‌ల‌ను శాశ్వతంగా నిషేధించ‌నున్నట్లు తెలుపుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది కేంద్ర సర్కార్.. అయితే, వారం ముందే స‌ద‌రు యాప్‌ నిర్వహకులకు ఈ నోటీసులు జారీ చేసింది కేంద్ర ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వశాఖ.. కానీ, త‌మ నోటీసుల‌కు యాప్‌ల యాజ‌మాన్యాలు ఇచ్చిన సరైన స‌మాధానాలు రాకపోవడంతో.. అమ‌లులో ఉన్న నిషేధాన్ని శాశ్వతంగా విధించ‌నున్నట్లు పేర్కొంది. చూడాలి మరి ఈ నిర్ణయాల పై చైనా ఏ విధంగా స్పందిస్తుంది అనేది.

Related posts