telugu navyamedia
సినిమా వార్తలు

ఛ‌లో విజ‌య‌వాడ‌.. ఆర్జీవీకి చ‌లి జ్వ‌రం..

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం సంగతేమోగానీ, విజయవాడలో ఈ జనాన్ని చూసి నాకు చలి జ్వరం వచ్చింది’ అంటూ వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ.. చలో విజయవాడకు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఉద్యోగుల ఉద్యమమే కాదు.. ఇటీవల సినిమా టికెట్ల వ్యవహారంపైనా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మంత్రి పేర్ని నాని ఆర్జీవీ మధ్య ట్వీట్ వార్ జరిగింది. ఆ తర్వాత వర్మ పేర్ని నానిని కలిసి సినిమా టికెట్ల ఎపిసోడ్‌పై చర్చించారు. ఆ తర్వాత నుంచి తరచూ ఏపీ రాజకీయాలపై తన స్టైల్లో స్పందిస్తున్నారు. తాజాగా ఉద్యోగుల ఉద్యమంపై వర్మ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.

తాజాగా.. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాలు గురువారం నిర్వహించిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. దాదాపు 4 కిలోమీటర్ల పొడవున్న బీఆర్టీఎస్‌ రహదారి మొత్తం వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనుదారులతో కిక్కిరిసిపోయింది.

ఎక్క‌డ చూసి జ‌న‌సందోహ‌మే.. ఎక్క‌డ విన్నా త‌మ డిమాండ్ల‌తో నినాదాలే.. ఓవైపు ఎండ మండిపోతున్నా.. న‌డీ రోడ్ల‌పై కూర్చొని.. నిల‌బ‌డి.. నినాదాల‌తో హోరెత్తించారు ఉద్యోగులు..

గురువారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకూ విజయవాడలోని బీఆర్టీఎస్‌ ఉద్యమ నినాదాలతో హోరెత్తింది. ‘మాయదారి పీఆర్సీ మాకొద్దు.. రివర్స్‌ పీఆర్సీ మాకొద్దు. చీకటి పీఆర్సీ జీవోలు రద్దు చేయాలి’ అంటూ ఉద్యోగుల గర్జనతో విజ‌య‌వాడ‌లో హ‌డ‌లెత్తించారు.

ప్ర‌భుత్వం.. చ‌ర్చ‌ల ద్వారానే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుందాం.. స‌మ్మెలు, ఆందోళ‌న‌తో ఏం సాధించ‌లేర‌ని ప్ర‌భుత్వం అంటుంది..దీనిపై స్పందించిన ఆర్జీవీ.. ఏపీ సర్కార్ సంగతేమో గానీ విజయవాడలో జన సందోహాన్ని చూసి నాకు భయంతో చలి జ్వరం వచ్చేసింది.. అంటూ చలో విజయవాడకు సంబంధించిన మ‌రో ఫొటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు..

సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ఉద్యోగులు ఇంత పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయడం షాకింగ్‌లా ఉంది. ప్రపంచంలో ఇలా ఎక్కడైనా జరిగిందంటారా?’ అని నా సందేహం.. అంటూ మరో ట్వీట్‌ చేశారు.

‘ఏపీలోని నిరసనకారులకు నేనిచ్చే సలహా ఒకటే! గట్టిగా నినదించాల్సిన సమయంలోనూ మౌనంగా ఉండటం పిరికితనమే’ అని మూడో ట్వీట్ చేశారు.

Related posts