telugu navyamedia
సినిమా వార్తలు

“సైరా” అప్డేట్ : తమన్నా పాత్ర ఇదే…?

Tamannah

నిన్న మొన్నటి వరకు హిట్ అనే మాటకు దూరమైనా తమన్నా “F2” తో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అమ్మడు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం “సైరా” సినిమాలో కూడా తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. కనిపించేది కొన్ని నిమిషాలే అయినా ఆమెకు సంబందించిన సన్నివేశాలు కథలో కీలకమని సమాచారం. తమన్నా క్యారెక్టర్ ఇచ్చే ట్విస్ట్ మేజర్ ప్లస్ పాయింట్ అని టాక్ వస్తోంది. ఉయ్యాలవాడ నరసిమహారెడ్డి రాజ్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి మహారాణి గా పన్నాగం పన్నుతుందట. ఆ పాత్ర నెగిటివ్ షేడ్ లో ఉండటం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్ గా మెగాస్టార్ సరసన నయనతార నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ప్రత్యేక గీతంలో అనుష్కను కూడా సెలెక్ట్ చేసుకున్నారు. సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అమితాబ్ బచ్చన్ – సుదీప్ – విజయ్ సేతుపతి వంటి ప్రముఖ నటులు సినిమాలో కీలక పాత్రలో కన్పించనున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related posts