ప్రియా ..!
కలలు కన్న ప్రతిసారి
నీ రూపం కదలాడుతుంది
ఆలోచించిన ప్రతిసారి
నీ జ్ఞాపకాలు వెంటాడుతుంది
నడుస్తున్న ప్రతిసారి
నీ కదలిక కనబడుతోంది
నిలబడిన ప్రతిసారి
నీ నీడ అనుసరిస్తోంది
కూర్చున్న ప్రతిసారి
నీ పలుకులు వినపడుతోంది
అందుకే…శాశ్వతంగా….
నీ పాద చలనంలో మువ్వనౌతా
నీ గుండె గగనంలో గువ్వనౌతా !
-కయ్యూరు బాలసుబ్రమణ్యం,
శ్రీకాళహస్తి
అనసూయ, హైపర్ ఆది కెమిస్ట్రీ… రైజింగ్ రాజు కామెంట్స్