telugu navyamedia
సినిమా వార్తలు

స్టార్ హీరోయిన్ వార్నింగ్… ప్రపోజ్ చేస్తే చంపేస్తా…!

Snakshi-Sinha

హీరోహీరోయిన్లకు అభిమానులు ఉండడం సాధారణమైన విషయమే. అయితే ఎక్కువగా హీరోలు అమ్మాయిలు… హీరోయిన్లకు అబ్బాయిలు అభిమానులుగా ఉంటారనేది అందరికీ తెలిసిన నిజం. సోషల్ మీడియా ఖాతాల్లో నటీనటులు తమ ఫోటోషూట్ లకు సంబంధించిన ఫోటోలను అభిమానుల కోసం పోస్ట్ చేస్తుంటారు. చాలామంది అబ్బాయిలు తమ అభిమాన హీరోయిన్ ఫోటో కన్పించగానే లైకులు, షేర్లు చేస్తుంటారు. ఇంకొంతమంది మాత్రం అభిమానం ముదిరి ఐ లవ్ యూ అంటూ కామెంట్లు కూడా చేస్తుంటారు. అయితే అలా ఎవరైనా తనకు ఆన్లైన్ లో ప్రపోజ్ చేస్తే చంపేస్తానని వార్నింగ్ ఇస్తోంది ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్.

బాలీవుడ్ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో సోనాక్షి సిన్హా కూడా ఒకరు. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ షోలో కామెంట్స్ బాక్స్ లో ఐ లవ్ యూ అని చెప్పే అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు సోనాక్షి. “అబ్బాయిలు ఎవరైనా సరే… నాకు ఆన్‌లైన్‌లో ప్రపోజ్‌ చేస్తే చంపేస్తా… ఆన్‌లైన్‌ డేటింగ్‌కి నేను అస్సలు ఒప్పుకోను” అంటూ చెప్పుకొచ్చారు. ఇక సోనాక్షి త్వరలో “కళంక్‌” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related posts