telugu navyamedia
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్బులో “భారత్”

Bharat

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ జంటగా నటించిన “భారత్” చిత్రం ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. సల్మాన్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించింది”భారత్”. ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ 73 కోట్లకు చేరింది. సల్మాన్ కి ప్రతి ఏడాది ఈద్ సెంటిమెంట్ కలిసొచ్చినట్లుగానే ఈ ఏడాది రంజాన్ కూడా కలిసొచ్చింది. మొదటిరోజు “భారత్” సినిమా 42.30 కోట్లను కలెక్ట్ చేసింది. మూడో రోజున 28 కోట్లను వసూలు చేసింది. ఇలా ఈ సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ట్విట్టర్ ద్వారా సల్మాన్ ధన్యవాదాలు తెలియజేశాడు.

Related posts