telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్ డీప్ నెక్ బ్లౌజ్ పై శ్రీముడి పేరు… నెటిజన్లు ఫైర్

Vani-Kapoor

తెలుగులో నానికి జోడీగా ‘ఆహా కళ్యాణం’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన వాణీ కపూర్ తెలుగులో చేసింది ఒక సినిమానే. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లిపోయారు. ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు అవుతున్నా చేసింది మూడు సినిమాలే. హృతిక్ రోషన్‌కి జోడీగా నటించిన ‘వార్’ సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. తాజాగా ఆమె వేసుకున్న దుస్తులతో వార్తల్లో నిలిచారు. లైట్ పింక్ కలర్ బ్లౌజ్ వేసుకుని అందాలు ఆరబోస్తూ ఫొటో షూట్ దిగారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ బ్లౌజ్‌పై రాసున్న అక్షరాలు చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ బ్లౌజ్‌పై హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీరాముడి పేరు రాసుంది. బ్లౌజ్ మొత్తం ఆయన పేరుతో ప్రింట్ అయివుంది. దాంతో వాణీ హిందువుల సంప్రదాయాన్ని మంటగలిపిందని, వారి మనోభావాలను దెబ్బతీసిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు. ఆమెను సినిమా పరిశ్రమ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో భయపడిన వాణీ కపూర్ వెంటనే సోషల్ మీడియా నుంచి ఆ ఫొటోలను డిలీట్ చేశారు. అయితే అప్పటికే నెటిజన్లు ఆ ఫొటోలను స్క్రీన్ షాట్స్ తీసి వైరల్ చేసేశారు. దాంతో ఆమె ఫొటోలు డిలీట్ చేసినా అవి అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. కానీ ఈ వివాదంపై మాత్రం వాణీ కపూర్ ఏమీ స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు.

Related posts