రౌడీ హీరో విజయ్ దేవరకొండ – పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్’. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు తెరకు పరిచయం కాబోతోంది.
రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, వీడియోస్ చూస్తే విజయ్ దేవరకొండ- అనన్యపాండే రొమాంటిక్ డోస్ ఏ రేంజ్ లో ఉండనుందో స్పష్టం చేశాయి. రేపు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు ఎప్పటిలాగే లైగర్ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే, నటీనటులు, విజయ్ దేవరకొండ యాక్టింగ్ తదితర అంశాలపై ఆయన స్పందించారు.
ఈ సినిమా విడుదలకు మరికొన్ని గంటలే సమయం ఉండగా.. తాజాగా ఈ మూవీ గురించిన ఫస్ట్ రివ్యూ నెట్టింట వైరల్ గా మారింది. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే, నటీనటులు, విజయ్ దేవరకొండ యాక్టింగ్ తదితర అంశాలపై సింపుల్ గా ఓ నాలుగు లైన్లతో రివ్యూ ఇచ్చారు.
పూరీ జగన్నాథ్ కూడా డైరెక్షన్ తో తన మార్క్ చూపించాడు. ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ స్టంట్స్, డైరెక్షన్, డైలాగ్స్ అదరగొట్టేశాడని రివ్యూలో చెప్పుకొచ్చాడు.
ఇక విజయ్ దేవరకొండ వన్ మెన్ షో అని చెప్పి జనానికి మరింత కిక్కిచ్చాడు. ఈ సినిమాలో రమ్యకృష్ణ సర్‌ప్రైజ్ ప్యాకేజీ చూస్తామని చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
కథ, స్క్రీన్ ప్లే రోటీన్ గా ఉన్నా.. పలు సీన్లు మాత్రం విజిల్స్ వేయించేలా ఉన్నాయంటూ ఉమైర్ సంధు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
మరి ఉమైర్ సంధు చెప్పినట్టుగానే ‘లైగర్’ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో లేదో మరికొద్ది గంటల్లో తెలుస్తుంది.