సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎన్టీయార్, లక్ష్మీపార్వతి జీవితకథ ఆధారంగా వర్మ తెరకెక్కించిన “లక్ష్మీస్ ఎన్టీయార్” ఇటీవల విడుదలై మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత కెసిఆర్, వైఎస్సార్ బయోపిక్ ఉంటుందని ప్రకటించారు వర్మ. అన్నట్టుగానే ఇప్పుడు కెసిఆర్ బయోపిక్‌కు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్‌ను వర్మ తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ బయోపిక్‌పై వర్మ దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన వర్మ సినిమాకు “టైగర్ కేసీఆర్” అని టైటిల్ పెట్టారు. కింద “ది అగ్రెసివ్ గాంధీ” “ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు” అని క్యాప్షన్లు పెట్టారు. ఇది కేటీఆర్ తండ్రి బయోపిక్ అని, ఆంధ్రుల పాలనలో అణిచివేతకు గురైన తెలంగాణ ప్రజలకోసం ఆయన ప్రత్యేక రాష్ట్రాన్ని ఎలా సాధించారో ఈ సినిమాలో చూపించబోతున్నామని వర్మ ట్వీట్ ద్వారా తెలియజేశారు.
తాజాగా కేసీఆర్ అంతటి గొప్ప వ్యక్తిని ‘ఆడు’ అనడం సరికాదని అనడం పట్ల స్పందించిన వర్మ “ట్యాగ్ లైన్ లో ఉన్న ‘ఆడు’ అనే పదం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వాళ్ల కోసమే ఈ ట్వీట్. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించకముందు ఆయనను ఇతరులు చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఓ రకమైన తక్కువభావంతో చూశారు. అలాంటి వ్యక్తుల అభిప్రాయాన్ని వెల్లడించే దృష్టికోణంలోనే ‘ఆడు’ అనే పదం ఉపయోగించాల్సి వచ్చింది” అంటూ ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చారు. అయితే, తన ట్యాగ్ లైన్ లో ఉన్న లోతును కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ అర్థం చేసుకుంటారని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు.
అమితాబ్ చిరుతో స్నేహం కోసమే చేశారు : రామ్ చరణ్