telugu navyamedia
సినిమా వార్తలు

సమంత ‘కమ్ బ్యాక్‌.. బిగ్గర్‌.. స్ట్రాంగర్‌..’

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు..వ‌రుస ప్రాజెక్టులతో క్ష‌నం తీరిక లేకుండా బిజీ బిజీ గ‌డేపేస్తుంది.బన్నీ ‘పుష్ప’ సినిమాలో ఆమె నటించిన ఐటెమ్ సాంగ్ కు వ‌చ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. తాజాగా ..సమంత గురించి మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రామ్ చరణ్ , జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7 న రిలీజ్ కి రెడీ అవుతున్నక్ర‌మంలో ప్రమోషన్స్ ని వేగవంతం చేసేశారు చిత్ర బృందం . ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ ఖాళీ లేకుండా తిరుగుతున్నారు.

Ram Charan injures his leg at gym. RRR team calls off Pune schedule -  Movies News

ప్రమోషన్‌లో భాగంగా రామ్ చరణ్ ని కొన్ని షార్ట్ క్వచ్ఛన్స్ ని అడిగారు యాంకర్స్. అలా రామ్‌చరణ్‌కి సమంత ప్రశ్న ఎదురైంది. సమంత గురించి మూడు ముక్కలో చెప్పలంటే ఏం చెప్తారు అని అడగగా.. వెంటనే రామ్ చరణ్ “సమంత కమ్ బ్యాక్.. బిగ్గర్.. మరియు స్ట్రాంగర్” అని అదిరిపోయే సమాధానమిచ్చాడు.

Rangasthalam box-office: Ram Charan-Samantha Ruth Prabhu's film earns 100  crores in 4 days

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక తాజాగా ఈ వీడియో చుసిన సామ్ ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ మూడు లవ్‌ సింబల్స్‌ గుర్తుతో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం సమంత ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. నెటిజన్లని తెగ ఆకట్టుకుంటుంది.. విడాకుల తరువాత ఎలాంటి ట్రోల్స్ ని పట్టించుకోకుండా స్ట్రాంగ్ గా నిలిచి కంబ్యాక్ ఇస్తోంది సమంత.

Related posts