బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్‌సింగ్ న్యూడ్ ఫోటో షూట్ చేయడం వివాదాస్పదమైంది. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి
ఈ వ్యవహారంలో రణ్‌వీర్‌సింగ్‌కు పోలీసులు కొద్ది రోజుల క్రితం నోటీసులు కూడా ఇచ్చారు. దేశవ్యాప్తంగా రణ్‌వీర్ నగ్న ఫోటో షూట్ కి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. నగ్న ఫొటోలను పోస్ట్ చేయడం ద్వారా మహిళల మనోభావాలను దెబ్బతీసారంటూ పలు పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదయ్యాయి.
కాగా ఈ కేసులో రణ్‌వీర్ సింగ్ ముంబై పోలీసుల విచారణకు హాజరయ్యారు. దీంతో అతడు ఆగస్టు 29న పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. అతడి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు.
అయితే తాజాగా ఆ స్టేట్మెంట్లో రణ్వీర్ ఏం చెప్పాడో పోలీసులు వెల్లడించారు. ఈ న్యూడ్ ఫొటోస్ ఓ ట్విస్ట్ చోటు చేసుకుందని అన్నారు. తాను పోస్ట్ చేసిన నగ్న ఫొటోల్లో ఒకటి మార్ఫింగ్ చేశారని రణ్వీర్ చెప్పారట. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. తాను పోస్ట్ చేసిన ఆ న్యూడ్ ఫొటోలో అండర్వేర్ వేసుకున్నట్లు రణ్వీర్ చెప్పినట్లు వెల్లడించారు.
ఆ ఫొటో మార్ఫింగ్ చేశారని పోలీసులతో రణ్వీర్ చెప్పారట! అయితే దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ ఫొటో మార్ఫింగ్ అయిందా లేదా అని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు చెప్పారు.
కాగా ..ప్రస్తుతం రణ్వీర్ సింగ్ హీరోగా సర్కస్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతుంది. రోహిత్ శెట్టి దర్శకుడు కాగా పూజా హెగ్డే, జాక్విలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని టైటిల్ తో మరో చిత్రం చేస్తున్నారు. ఈ మూవీలో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఇష్టం ఉన్నా లేకపోయినా భార్య చెప్పింది చచ్చినట్లు వినండి : పూరి జగన్నాథ్