మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. మలయాళ ‘లూసిఫర్’కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ పోషిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. సెప్టెంబర్ 15న సినిమాలో మొదటి పాటను విడుదల చేశారు.
‘తార్ మార్ తక్కర్ మార్’ అంటూ సాగే ఈ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ మాస్ స్టెప్స్ వేస్తూ కనిపించారు. శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాటకి అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు.
మరోవైపు ఈ సాంగ్ కంపొజిషన్ విషయంలో మ్యూజిక్ నూ తమన్ కాపీ కొట్టాడంటూ జోరుగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘తార్ మార్ తక్కర్ మార్’ అనే ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ఈ ట్యూన్ విన్న ప్రేక్షకులు తమన్ మళ్లీ కాపీ కొట్టాడంటూ ట్రోల్స్ మొదలు పెట్టారు. క్రాక్ సినిమాలో ఓ పాటకు థమన్ ఇచ్చిన ట్యూన్ ను మళ్లీ ‘గాడ్ ఫాదర్’ కోసం వాడేశారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు ‘తార్ మార్ టక్కర్ మార్’ పాట రవితేజ క్రాక్ చిత్రంలోని ‘డండనకర నకర.. నకర’ పాటలాగే ఉందంటున్నారు.
ఈ సాంగ్ కంపొజిషన్ విషయంలో తమన్ పై ట్రోల్స్ వచ్చినప్పటికీ.. మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వెండితెరపై ఈ సాంగ్ వస్తే థియేటర్లో రచ్చ రంబోలా ఖాయం.
#ThaarMaarThakkarMaar out on @spotifyindia 🎧
Telugu- https://t.co/I454U8Id23
Hindi- https://t.co/FMhF2wXoBpLyrical soon!#GodFather@KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @MusicThaman @PDdancing @shreyaghoshal @AlwaysRamCharan @ProducerNVP @saregamasouth pic.twitter.com/RGm7KppHAE
— Konidela Pro Company (@KonidelaPro) September 15, 2022