telugu navyamedia
సినిమా వార్తలు

బాబాయ్​ ట్రైలర్​పై అబ్బాయి రియాక్ష‌న్‌..

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటిల భారీ మల్టిస్టారర్‌ చిత్రం ‘భీమ్లా నాయక్‌’. ఫిబ్రవరి 25న ఈ మూవీ విడుదల కానుంది. పవన్ కల్యాణ్ పోలీస్ గా వస్తున్న సినిమా కావడంతో.. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. భీమ్లా నాయక్ సినిమా కోసం ఇటూ మెగా ఫ్యాన్స్‌, అటూ దగ్గుబాటి ఫ్యాన్స్‌ ఉంత్కంఠగా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ‘భీమ్లా నాయక్‌’ సినిమా ట్రైలర్​ను ఫిబ్రవరి 21న విడుదల చేశారు. ఈ చిత్రం ట్రైలర్​ చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

తాజాగా మెగా హీరో రామ్ చరణ్.. తన బాబాయ్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ట్రైలర్ పై స్పందించారు. ట్రైలర్ పై ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు..’భీమ్లా నాయక్​ ట్రైలర్​ ఎలక్ట్రిఫైయింగ్​గా ఉంది. పవన్​ కల్యాణ్​ గారి ప్రతీ డైలాగ్​, యాక్షన్​ పవర్​ఫుల్​గా ఉంది. నా మిత్రుడు రానా నటన, కనిపించిన తీరు సూపర్బ్​గా ఉంది. త్రివిక్రమ్​, సాగర్​ కె చంద్ర, నిత్య మీనన్​, సితార ఎంటర్​టైన్​మెంట్స్​, తమన్​కు ఆల్​ ది బెస్ట్​’ అంటూ ట్విటర్​ వేదికగా తెలిపాడు.

భీమ్లా ట్రైలర్ కు తనదైన శైలిలో రివ్యూ ఇచ్చిన చరణ్.. ఆల్ ది బెస్ట్ చెప్తూ..

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీరిలీజ్​ ఈవెంట్​ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 21న జరగాల్సిన ఈ కార్యక్రమం వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫిబ్రవరి 23 (బుధవారం) సాయంత్రం భీమ్లా నాయక్​ ప్రీరిలీజ్​ ఈవెంట్​ను హైద‌రాబాద్‌లోని యూస‌ఫ్‌గూడ‌లో నిర్వహించనున్నారు.

Related posts