telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎమోష‌న‌ల్ రోల‌ర్‌కోస్ట‌ర్‌గా మెప్పించనున్న జీ 5 స‌రికొత్త వెబ్ సిరీస్ ‘మాయాబజార్ ఫర్ సేల్’ ట్రైలర్ విడుదల

ఇరుగు పొరుగుతో బావుండాలి.. ఏదైనా ఇబ్బంది వ‌స్తే మ‌న‌కు బాస‌ట‌గా నిల‌బ‌డేది వారే. ఇరుగు పొరుగు అంటే మ‌న ప‌క్కింటి వాళ్లు.. మ‌న ప‌క్క వీధి వాళ్లు.. ప‌క్క ఊరు వాళ్లు.. ఇలా చెప్పుకుంటూ వెళ్లొచ్చు. కానీ పెరుగుతున్న న‌గ‌రీక‌ర‌ణ‌, మారుతున్న‌ సంస్కృతి సాంప్ర‌దాయ‌ల న‌డుమ ఇప్పుడు స‌ద‌రు ఇరుగు పొరుగుకి అర్థం మారిపోయింది. హైద‌రాబాద్ వంటి మ‌హా న‌గ‌రంలోని ఉండేవాళ్లు ఎవ‌రి బిజీలో వాళ్లుంటారు. ప‌క్క‌న ఎవ‌రున్నార‌నేది ప‌ట్టించుకోరు. మ‌రి ఇలాంటి ప్రాంతాల్లో ఇరుగు పొరుగు అంటే .. గేటెడ్ క‌మ్యూనిటీస్‌.. అపార్ట్‌మెంట్ క‌ల్చ‌రే అని చెప్పాలి.

ఓ గేటెడ్ క‌మ్యూనిటిలో భిన్న మ‌న‌స్త‌త్వాలున్న కుటుంబాలుంటాయి. కోప తాపాలుంటాయి. ఒక్కొక్క‌రి ప్ర‌వ‌ర్త‌న ఒక్కోలా ఉంటుంది. కొంద‌రిని గ‌మ‌నిస్తే విచిత్రంగా కూడా అనిపిస్తాయి. అలాంటి గేటెడ్ కమ్యూనిటీ వాతార‌ణంపై రూపొందిన వెబ్ సిరీస్ ‘మాయాబజార్ ఫర్ సేల్’. ఎప్ప‌టి క‌ప్పుడు స‌రికొత్త కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోన్న టాప్ వెబ్ ఫ్లాట్‌ఫామ్ జీ 5లో ఈ సిరీస్ జూలై 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

జీ 5తో పాటు రానా ద‌గ్గుబాటికి సంబంధించిన స్పిరిట్ మీడియా..మిరాజ్ మీడియా బ్యాన‌ర్ క‌లిసి రాజీవ్ రంజ‌న్ నిర్మాత‌గా రూపొందించిన ‘మాయబజార్ ఫర్ సేల్’ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. గౌత‌మి చల్ల‌గుల్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Mayabazaar Trailer

డా. న‌రేష్ వి.కె, న‌వ‌దీప్‌, ఝాన్సీ, ఈషా రెబ్బా, మెయంగ్ చంగ్‌, కోట శ్రీనివాస‌రావు, సునైన‌, హ‌రితేజ‌, రాజా చెంబోలు, ర‌వివ‌ర్మ త‌దిత‌రులు న‌టించారు. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. మాయాబ‌జార్ అనే గేటెడ్ క‌మ్యూనిటిలో కుటుంబాలు ఎంత విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తుంటాయ‌నే విష‌యాన్ని కామెడీ కోణంలో చూపించారు. కొంద‌రు పిల్లుల్ని పెంచుకుంటుంటారు, కొంద‌రు ఆవుల‌ను పెంచుతుంటారు. ఓ ఇంటావిడైతే మొగుడిపై అనుమానంతో గొడ‌వ ప‌డుతూనే ఉంటుంది. కొంద‌రు చాద‌స్తంగా మాట్లాడుతుంటారు. వీరంద‌రి క‌లిసి ఉండే గేటెడ్ క‌మ్యూనిటీని ప్ర‌భుత్వ అనుమ‌తి లేని ప్రాంతంలోకి నిర్మించి ఉంటారు. చివ‌ర‌కు మాయాబ‌జార్ గేటెడ్ కమ్యూనిటీలోని ఇళ్ల‌ను కూల్చి వేయాల‌ని బుల్డోజ‌ర్స్‌తో అధికారులు వ‌స్తారు. అప్పుడు ఏమ‌వుతుంది. వారి గేటెడ్ క‌మ్యూనిటీని కాపాడుకున్నారా? అనేది తెలియాలంటే జూలై 14 వ‌ర‌కు ఆగాల్సిందే.

జీ5 గురించి….
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలి ఇలా ఇతర భాషల్లో ఉన్న గొప్ప కంటెంట్‌ను జీ5 నిత్యం ఆడియెన్స్‌కు అందిస్తూనే ఉంది. దేశ వ్యాప్తంగా జీ5కి మంచి కంటెంట్ అందిస్తుందనే పేరు ఉందన్న సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మీద నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన లూసర్ 2, బీబీసీ స్టూడియో, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన గాలివాన, రెక్కి, హలో వరల్డ్, మా నీళ్ల ట్యాంగ్, అహ నా పెళ్లంట, ఏటీఎం, పులి మేక, వ్య‌వ‌స్థ, విమానం ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. ఇప్పుడు ఈ లిస్టులో ‘మాయాబజార్ ఫర్ సేల్’ వెబ్ సిరీస్ చేరనుంది.

Related posts