కట్టని రాజధాని కోసం 1000 రోజులుగా కృత్రిమ ఉద్యమం..
అమరావతిపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు..
అమరావతిలో రాజధాని తీసేయాలని నేను అనలేదు..
విశాఖ, కర్నూల్‌లో కూడా పెట్టమన్నాను..
కట్టని రాజధాని, కట్టలేని గ్రాఫిక్స్ గురించి 1000 రోజులుగా ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని సీఎం జగన్ ఆరోపించారు. ఏపీ అసెంబ్లీలో వికేంద్రీకరణ పై సుదీర్ఘ చర్చ లో భాగంగా సీఎం జగన్ మాట్లాడారు.
మూడు ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలనే.. మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామన్నారు . అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ.. ఇతర ప్రాంతాలను రెచ్చగొడుతున్నారని అన్నారు.
1956-2014 వరకు 58 ఏళ్లలో చంద్రబాబు ఏ ఉద్యమం చేయలేదు. ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమాలు చేస్తున్నారని ప్రశ్నించారు.అమరావతి రాజధాని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం కాదు.. కేవలం పెత్తందారుల సొంత అభివృద్ధి కోసమేనని సీఎం జగన్ తెలిపారు.
ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కన్నా కట్టని, కట్టలేని అమరావతి చంద్రబాబుకు గొప్పదన్నారు. రాజధానిలో తన అనుచరులతో చంద్రబాబు భూములు కొనుగోలు చేశారని సీఎం జగన్ ఆరోపించారు.
ప్రజా సంక్షేమానికి రూ.లక్షా 65 వేల కోట్లు ఖర్చు చేశామని అన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు హయాంలో డీపీటీ పథకానికి ‘దోచుకో.. దాచుకో.. పంచుకో’ ఇదే నాటి డీపీటీ పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు..
రాజధాని నిర్మాణానికి 4-5 లక్షల కోట్లు అవుతాయని చంద్రబాబే అన్నారని, ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున లక్షా 10 వేల కోట్లు.. అవసరం అవుతాయని చంద్రబాబు చెప్పారని తెలిపారు. ప్రతిపక్షంలోనూ తన మనుషులే ఉండాలని చంద్రబాబు కోరుకుంటారని జగన్ విమర్శించారు
దొంగలెక్కల వీసారెడ్డి స్కూల్లో.. సజ్జల శిక్షణ పొందినట్లున్నారు: అనురాధ