తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలను బీజేపీ నేతలు ప్రారంభించారు .ఈ నెల 17 నుంచి తెలంగాణ విమోచన అమృత మహోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి.
ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కిషన్ రెడ్డి.. అనంతరం బైక్ ర్యాలీని ప్రారంభించారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి మొదలైన మహిళల బైక్ ర్యాలీ.. పరేడ్ గ్రౌండ్ మీదుగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు ఈ బైక్ ర్యాలీ కొనసాగనుంది.
.జాతీయ జెండాల రెపరెపల మధ్య, కాషాయ తలపాగాలు ధరించిన బీజేపీ మహిళా కార్యకర్తలంతా ర్యాలీలో పాల్గొన్నారు.ఈ బైక్ ర్యాలీలో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 17నకేంద్ర హోంమంత్రి అమిత్ షా పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తుంది.
గులాబీ జెండా ఎగరడం ఖాయం: మంత్రి గంగుల